నేను రానంటే రాను.. మొండికేసిన సితార.. మహేష్ ఫ్యామిలీలో మరొకరికి ఆ భయం!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహర్షి మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న మరో సందేశాత్మక చిత్రం ఇది. ఇటీవలే మహర్షి చిత్ర షూటింగ్ ఫినిష్ కావడంతో మహేష్ బాబు ఫ్యామిలీతో ప్యారిస్ టూర్ వెళ్ళాడు. తిరిగొచ్చిన తర్వాత మహేష్ మహర్షి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

మొండికేసిన సితార
ప్యారిస్ టూర్ లో ఉన్న నమ్రత సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సితార చేయి పట్టుకుని నడిపిస్తున్న దృశ్యాన్ని నమ్రత పోస్ట్ చేసింది. ఇందంతా గత రాత్రి జరిగిన సంఘటన వలన అంటూ నమ్రత జరిగిన విషయాన్ని వెల్లడించింది. ప్యారిస్ లో మహేష్ కుటుంబం బస చేస్తున్న హోటల్ బయట ప్రొద్దు తిరుగుడు పుష్పాలు ఉన్నాయి. వాటిపై తేనెటీగలు తిరగడం సితార గమనించిందట. ఇక అంతే హోటల్ నుంచి అడుగు బయటకు పెట్టనంటూ మొండికేసింది అని నమ్రత తెలిపారు.

ఓ ప్లాన్ వేశా
సితారకు కీటకాలంటే చాలా భయం. తేనెటీగలని చూసినప్పటి నుంచి బాగా భయపడిపోయింది. అందుకే సితారని బయటకు తీసుకెళ్లేందుకు ఓ ప్లాన్ వేశా. బయట ఉన్నత సేపు నీ చేయి వదిలిపెట్టను అని నమ్రత తన కుమార్తెకు హామీ ఇచ్చిందట. దీనితో బయటకు వాకింగ్ కి వెళ్లేందుకు సితార ఒప్పుకుందని నమ్రత తెలిపింది. సితార ఇంస్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

మహేష్ ఫ్యామిలీలో మరొకరికి
నమ్రత చేసిన ఈ పోస్ట్ పై ఆమె సోదరి శిల్పా స్పందించారు. ఓ గాడ్.. ఫ్యామిలిలో మరొకరికి కూడా కీటకాలంటే భయమా.. నమ్రత నీ ప్లాన్ నిజంగా వర్కౌట్ అయ్యిందా అని శిల్పా సరదాగా ప్రశ్నించారు. సితార చిన్ననాటి నుంచే తన క్యూట్ లుక్స్, అల్లరి చేష్టలతో నెటిజన్లని ఆకర్షిస్తోంది. మహేష్, నమ్రత తరచుగా సితారకు సంబంధించిన ఫోటోలని, విశేషాలని సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు.

భారీ అంచనాలతో
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ నటించిన మహర్షి చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అశ్విని దత్, పీవీపీ, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్యారిస్ నుంచి తిరిగొచ్చాక మహేష్ బాబు మహర్షి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు.


Click it and Unblock the Notifications











