»   » మీరు చూసారా?: ఎక్కడ చూసినా మహేష్, సమంత ఫొటోలే

మీరు చూసారా?: ఎక్కడ చూసినా మహేష్, సమంత ఫొటోలే

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: హఠాత్తుగా మహేష్, సమంత గురించి చర్చ అంతటా మొదలైంది. కారణం ఏమిటీ అంటే ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ లో వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవటం, చాలా సరదాగా ఇద్దరూ ఉత్సాహంగా కలిసి ఉండటం తో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకూ మహేష్, సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అనుకున్నవారు ఈ మూమెంట్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే గతంలో మహేష్...1 నేనొక్కిడినే చిత్రం పోస్టర్ పై ఆమె కామెంట్ చేయటంతో మహేష్ ప్రక్కన పెట్టాడని అంతటా చెప్పుకున్నారు. వారిద్దరి మధ్యా చెడిందని అనుకున్నారు. అయితే ఈ సంఘటనతో అదేమీ కాదని తేలిపోయింది.

  నీ పని నువ్వు చేయి...ఫలితం నాకు వదిలెయ్యి అంటాడు గీతాచార్యుడు. ఇప్పుడు సమంత కూడా కొంచెం అటూ ఇటూ లో అదే పాటిస్తున్నానంటోంది. విజయం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక హీరోయిన్ గా నా వైపు నుంచి నేను ఏం చేయాలో అది మాత్రమే చేస్తా. ఫలితాన్ని ఆ దేవుడికి వదిలి పెడతా అంటోంది.

  ప్రస్తుతం సమంత పట్టిందల్లా బంగారమే అన్నట్లు కెరీర్ సాగుతోంది. విజయం ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడంటే కాస్త అనుభవం వచ్చింది సరే... తొలి నుంచీ కథల ఎంపికలో ఆమె గురి తప్పలేదు. అందుకే తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది. ఇంతకీ ఆ రహస్యమేమిటి? సమంత ఏం చూసి సినిమాల్ని ఎంచుకొంటోంది? ఇదే విషయం ఆమెని అడిగితే పై విధంగా సమాధానమిచ్చింది.

  Mahesh, Samantha: Magical Moment at FILMFARE!

  అలాగే..... '' ముఖ్యంగా కథ, పాత్రల విషయంలో పక్కాగా ఉంటాను. అలాగని ప్రతిసారీ 'ఏ మాయ చేసావె', 'ఈగ', 'మనం'లాంటి పాత్రలే దొరకాలని కోరుకోను. అది సాధ్యం కాదు కూడా. ఒక కథగా చూసినా అది ప్రేక్షకుల మనసుకు హత్తుకొనేలా ఉండాలి. అప్పుడే అంగీకరిస్తా. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌ కోసమే అన్నట్టు ఉండకూడదు. నా దగ్గరికొచ్చిన ఆ తరహా కథల్ని చాలానే తిరస్కరించా. నా బలమో, బలహీనతో తెలియదు కానీ విన్న ఓ కథగానీ, పాత్రగానీ నేను నమ్మలేకపోతే అస్సలు చేయను'' అని చెప్పుకొచ్చింది.

  'మనం'లో ఇటు అందంతోనూ, అటు అభినయంతోనూ అదరగొట్టేసింది. అందరికళ్లనూ తనవైపు తిప్పుకొంది. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఆ చిత్రంలో సమంత పోషించిన పాత్రకి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి పాత్ర అప్పజెప్పినా తాను న్యాయం చేయగలుగుతానని మరోసారి నిరూపించింది సమంత. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత తెలుగుతో పాటు ఇప్పుడు తమిళంలోనూ బిజీ అయిపోయింది.

  అక్కడ కాసింత గ్లామర్‌పాళ్లు ఎక్కువుండే పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ''నటనను నమ్ముకొనే వచ్చాను. అందాల ప్రదర్శన బ్రహ్మ విద్య కాదు. అది ఎవరైనా చేస్తారు. పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోవడంలోనే అసలు ప్రతిభ దాగుంది'' అని సమాధానమిచ్చింది సమంత. సమంత ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్‌తో 'రభస'లో చేస్తోంది. తదుపరి అల్లు అర్జున్‌తో కలిసి ఓ చిత్రంలో ఆడిపాడుతుంది. తమిళంలో మాత్రం మూడు చిత్రాలతో హల్‌చల్‌ చేస్తోంది. ఇక సమంత మరోసారి మాయ చేసింది.

  English summary
  At Filmfare Awards last night, Mahesh and Samnatha were allotted seats side-by-side. These pictures show how the gorgeous beauty greeted Superstar soon after her arrival and their facial expressions while starring at each other & during a conversation.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more