మహేష్ బాబు, సమంత, త్రివిక్రమ్ కలిసి స్కిట్
హైదరాబాద్: మహేష్ బాబు, సమంత, త్రివిక్రమ్ అనగానే ఈ ముగ్గురు కలిసి ఏదో కొత్త సినిమా చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఈ ముగ్గురు కలిసి ఈ నెల 30న జరిగే ‘మేము సైతం' కార్యక్రమంలో స్కిట్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్కిట్ రచిస్తున్నారు కాబట్టి అందిరి పోతుందనే అంచనాలతో ఉన్నారు ఫ్యాన్స్.
విశాఖ హుధూద్ బాధితుల సహాయార్థం నిధుల సేకరణలో భాగంగా టాలీవుడ్ పరిశ్రమ ఈ నెల 30న ‘మేము సైతం' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ స్టార్స్ అంతా కబడ్డీ మ్యాచ్ ఆడబోతున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌తో పాటు మంచు లక్ష్మి కూడా వివిధ జట్లుగా విడిపోయి ఆడబోతున్నారు. వీరి టీంలలో ఇతర హీరోలు, హీరోయిన్లు, నటులు ఉంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, జూ ఎన్టీఆర్ లాంటి వారు తమ తమ కార్యక్రమాలతో ప్రత్యేకత చాటబోతున్నారు.

మేము సైతం...ప్రొగ్రామ్ చూసేందుకు ఒక్కో టికెట్ ఖరీదు భారీగా ఉంది. బుక్ మై షో ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఈ టికెట్స్ కొన్నవారంతా థంబోలా గేమ్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు. థంబోలా గేమ్ విజేతకు మెర్జిడెజ్ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











