twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ సీతమ్మవాకిట్లో...’మనోభావాలను దెబ్బతీసిదంటూ..

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలై చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రంలో ప్రదర్శించిన కొన్ని సన్నివేశాలు హైదవుల, శ్రీరామ భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లి ఖార్జున స్వామి వారి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మారగాని శ్రీనివాసరావు ఆరోపించారు. శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో అగ్ని ప్రమాదం సంభవించే సన్నివేశంలో కేవలం హీరోలు తమ హీరోయిజాన్ని ప్రదర్శించటానికి పెట్టారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.

    శ్రీరామనవమి రోజున పంచభూతాలు సహకరిస్తాయనీ ఆ రోజు ప్రతి గ్రామంలోనూ వరుణదేవుడు వర్షించి చల్లని వాతావరణాన్ని ప్రసాదిస్తారని తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఎటువంటి ఆటంకాలకు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన దాఖలాలు నేటివరకు లేవన్నారు. చిత్రంలో ప్రదర్శించిన నన్నివేశాలు యావత్తు హైందవులను, శ్రీరామ భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రం నుండి అభ్యంతరకరమైన నన్నివేశాలను తొలగించని పక్షంలో కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల చిత్రీకరణ హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని, ఆ సన్నివేశాలను వెంటనే తొలగించి స్వామివారి ప్రాభవాన్ని కాపాడాలని ఖమ్మం శ్రీభ్రమరాంభ సమేత మల్లిఖార్జున దేవస్థానం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మరెగాని శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారికి విజ్ఞప్తి చేశారు.

    శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవంలో విద్యుత్‌షాక్‌తో అగ్ని ప్రమాదాలు సంభవించినట్లుగా శ్రీరామ భక్తులు మృత్యు భయంతో విలవిలలాడినట్లుగా, కళ్యాణ వేదిక అగ్ని ప్రమాదానికి గురైనట్లుగా అభ్యంతరకరంగా చిత్రీకరించారని సెన్సార్ బోర్డుకు ఇచ్చిన విజ్ఞాపనలో పేర్కొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలను ముక్కోటి దేవతలు దర్శిస్తారని భక్తులు విశ్వాసమని, వారి భావాలను దెబ్బతినేలా సినిమా తీయడం భావ్యం కాదని పేర్కొన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

    English summary
    SVSC, Mahesh’s latest flick, landed in controversy soon after it hit screens this Sankranthi. Seetamma Vaakitlo Sirimalle Chettu has been going very strong in all centers of AP . Keeping this craze in mind, extra screens are being added in every town to accommodate the huge crowds
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X