»   » ట్రైలర్..ఫ్రెష్ గా ఇన్నోవేటివ్ గా ఉంది :మహేష్ బాబు

ట్రైలర్..ఫ్రెష్ గా ఇన్నోవేటివ్ గా ఉంది :మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తాను చూసిన ట్రైలర్ చాలా ప్రెష్ గా ఇన్నోవేటిగా ఉందంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేసారు. ఇంతకీ ఆయన చెప్పేది ఏ ట్రైలర్ గురించి అంటారా...ఆయన బావ సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు ట్రైలర్ గురించి. ఆయన చేసిన ట్వీట్ ఇక్కడ చూడండి.


''కొన్ని రోజుల ముందు యూట్యూబ్‌లో టీజర్ చూశా. కొత్తగా ఉందనిపించింది. ఇప్పుడు ప్రచార చిత్రం చూశా. బాగా నచ్చింది. ఇవాళ ప్రేక్షకులు కొత్తదనాన్నే కోరుకుంటున్నారు'' అని హీరో మహేశ్‌బాబు అన్నారు.


సుధీర్‌బాబు, వామిక జంటగా 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన చిత్రం 'భలే మంచి రోజు'. సన్నీ ఎం.ఆర్. స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు ఆవిష్కరించారు.మహేశ్ మాట్లాడుతూ -''చిత్ర దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. సుధీర్‌ను అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సుధీర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ పర్సన్. ఒక మంచి హిట్ పడితే, స్టార్ అయిపోతాడు. ఈ సినిమాతో ఆ హిట్ వస్తుందని అనుకుంటున్నా'' అని అన్నారు.


English summary
Mahesh Babu tweeted: " The trailor of bhale manchi roju is fresh and innovative ..enjoyed watching it :)"
Please Wait while comments are loading...