మహేష్ టార్గెట్...మెగా, నందమూరి ఫ్యాన్సేనా?
పోకిరి సినిమాతో ఆ మధ్య టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు హీరో మహేష్ బాబు. చాలా కాలం వరకు పోరికి రికార్డు అలా ఉండి పోయింది. ఆ తర్వాత 'మగధీర' అంటూ వచ్చిన రామ్ చరణ్ తేజ్ తన సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఇటీవల వచ్చిన ఊసరవెల్లి సినిమా కూడా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తమ అభిమాన హీరోల రికార్డుల పేరు చెప్పుకుంటూ ఇటీవల పలు సందర్భాల్లో కొందరు అభిమానులు రెచ్చి పోయారు కూడా. పంజా సినిమా విడుదల సందర్భంగా మెగా అభిమానులు...మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ను దూషిస్తూ ప్లెక్సీలు కట్టడం ఆ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది కూడా. ఇలాంటి ఘటనలు అభిమానులకు, అభిమానులకు పడక పోవడం వల్లనే చోటు చేసుకున్నాయి. ఈ గొడవల్లో తలదూర్చితే అనవసర తలనొప్పులు వస్తాయని అటు హీరోలంతా సైలెంట్ గా ఉండి పోయారు.
సంక్రాంతికి మహేష్ బాబు 'బిజినెస్ మ్యాన్' సినిమా విడుదలవుతోంది. దాదాపు 1100 పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 100 థియేటర్లు రిజర్వు చేశారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానుల నుంచి ఓ వాదన వినిపిస్తోంది. బిజినెస్ మ్యాన్ భారీ విడుదల వెనక పెద్ద వ్వూహమే ఉందని, దూకుడు సినిమాతో మిస్సయిన రికార్డుల బద్దలు పర్వం, బిజినెస్ మ్యాన్ తో పూర్తి చేయడానికే మా హీరో సినిమా భారీగా విడుదల చేస్తున్నారని, ఇప్పటి వరకు మా హీరో గురించి చులకనగా మాట్లాడిన ఆ ఇద్దరు హీరోలకు చెందిన అమానుల నోరు మూయించడమే ఈ భారీ విడుదల వెనక ఉన్న అసలు వ్యూహమని అంటున్నారు.


Click it and Unblock the Notifications











