‘1-నేనొక్కడినే’: గౌతం ఫస్ట్ లుక్ ఇదే (ఫోటో)
హైదరాబాద్: హేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ద్వారా.....మహేష్ తనయుడు గౌతం కృష్ణ బాల నటుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ చిన్నతనంలోని పాత్రను తనయుడు గౌతమ్ పోషిస్తున్నాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలో గౌతం కృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
తన తనయుడు తెరంగ్రేటం చేస్తుండటంపై ఎంతో సంతోషంగా ఉన్న మహేష్ బాబు.....తనయుడి టాలెంటు చూసి పొంగి పోతున్నారు. పలు ఆసక్తికర విషయాలు ఆసక్తికర విషయాన్ని మహేష్ బాబు వెల్లడించారు. గౌతమ్ నటిస్తున్న సమయంలో తాను షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదని చెప్పారు.

గౌతం యాక్ట్ చేసే సమయంలో తాను లొకేషన్లో ఉంటే వాడి దృష్టి అంతా తనపైనే ఉంటుందనిపించింది. అందుకే ఆ సమయంలో షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదని మహేష్ బాబు చెప్పారు. అంతకుముందు గౌతమ్ యాక్ట్ చేయడంపై మాట్లాడుతూ.. '1' షూటింగ్ మొదలైన మూడు నెలలకు గౌతమ్‌తో యాక్ట్ చేయిద్దామని దర్శకుడు సుకుమార్ తనతో అన్నారు' అని వెల్లడించారు.
ఆ తర్వాత తన అసిస్టెంట్‌తో కలిసి సుకుమార్ రెండు మూడు రోజులు తమ ఇంటికొచ్చి గౌతమ్‌తో ఆడుకునే వారని చెప్పారు. గౌతంతో చనువు పెంచుకుంటే ఈజీగా నటింపచేయవచ్చనే ఆలోచనలో వారు ఇలా చేసారని తెలిపారు. సుకుమార్ కోరుకున్న విధంగా గౌతం నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగారని మహేష్ బాబు చెప్పారు.
'1-నేనొక్కడినే' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











