twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొడుకుతో తెరపై మహేష్ ఖరారు...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు తన వారసుడు గౌతమ్ ని తెరపై చూపించబోతున్నారు. ఆరేళ్ల కుమారుడు గౌతమ్‌కృష్ణతో కలిసి మొదటిసారి తెరపై కనిపించబోతున్నాడు మహేశ్. ఆయన హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గౌతమ్ కనిపించి అలరించబోతున్నారు.

    దూకుడు వంటి సంచలన చిత్రం నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తండ్రీ కొడుకులు మహేశ్, గౌతమ్‌పై ఓ టెస్ట్ షూట్‌ను నిర్వహించి, సంతృప్తి చెందాడు సుకుమార్. త్వరలోనే సినిమాకి సంబంధించిన సన్నివేశాల్ని ఆ ఇద్దరిపై తీయనున్నాడు. ఈ సంగతిని మహేష్ తెలిపాడు.

    మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ బాబు న్యూలుక్‌తో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డింగ్ ట్రైనర్ క్రిస్ గెతిన్‌ ఆధ్వర్యంలో మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ విషయమై మహేష్ బాబు తన ట్విట్టర్లో ప్రస్తావించారు. 'గడిచిన మూడు నెలలు చాలా కష్ట పడ్డాను. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ క్రిస్ గెతిన్ పర్యవేక్షణలో న్యూలుక్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. నా కొత్త లుక్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అంటూ మహేష్ బాబు ట్విట్ చేసారు.

    ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నానని, రాబోయే 10 రోజులు నైట్ షూటింగ్ ఉందని, ఈ నెల 11న నంది అవార్డు ఫంక్షన్‌కు హాజరవుతానని, దూకుడు సినిమాకు వచ్చిన నంది అవార్డును స్వీకరిస్తానని మహేష్ బాబు వెల్లడించారు. అదే విధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు మహేష్.

    మహేష్-సుకుమార్ సినిమా వివరాల్లోకి వెళితే... క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈచిత్రానికి టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    Mahesh Babu son Ghattamaneni Gautam Krishna is all set to make his debut very soon. Just Like his father, who made his debut as a child artist, he going to play the younger version of Mahesh in his next film under the direction of Sukumar. A mock test has been conducted yesterday in the presence of Mahesh and Namratha. The shooting of Gautham's portions will begin soon. A newcomer Kriti Sanon is pairing with Mahesh in this film. Anil Sunkara, Gopichand Achanta and Ram Achanta are producing the film under 14 Reels Entertainment banner. Devi Sri Prasad is composing the music. Rathnavelu is handling the camera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X