శ్రీను వైట్ల కోసం మహేష్ బాబు ‘ఆగడు’
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 2011లో వచ్చిన 'దూకుడు' మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది.
దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'ఆగుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దూకుడు తరహాలో 'ఆగడు' టైటిల్ క్యాచీగా ఉండటంతో దీన్నే దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది.
14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆ సంస్థ పని తీరు నచ్చడం వల్లనే మహేష్ బాబు వరుసగా ఆ సంస్థ కోసం డేట్స్ ఇస్తున్నారని, పైగా అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు మహేష్‌కు బాగా సన్నిహితులు అవ్వడం కూడా మరోకారణం అంటున్నారు.


Click it and Unblock the Notifications











