మహేష్ బాబు, శ్రీను వైట్ల చిత్రం లాంచింగ్ విశేషాలు
మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం ఈ రోజు (జూన్ 28, 2010) న రామా నాయుడు స్టూడియోస్, హైదరాబాద్ లో సైలెంట్ గా ఉదయం 7 గంటల 30 నిముషాలకు లాంచ్ అయింది. దర్శకుడు, హీరో, నిర్మాతల సమక్షంలో ఈ పూజా కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. మీడియాని ఎవరినీ పిలవకుండా ఓ ప్రెస్ నోట్ మాత్రం పంపారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రం జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలియచేసారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తూండగా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ బాబు సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని, వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని, సమంత హీరోయిన్ అని మీడియాకు ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసారు. అలాగే శ్రీను వైట్ల...మహేష్ ను ఈ చిత్రంలో కొత్తగా ప్రెజెంట్ చేస్తాను. నా రెగ్యులర్ ఎంటర్టైనమెంట్ మిస్సవకుండా హై ఓల్టేజ్ యాక్షన్, సెంటిమెంట్ తో ఈ చిత్రం రూపొందిస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











