»   » మహేష్‌ బాబు తొలి తమిళ చిత్రంకి రంగం సిద్దం

మహేష్‌ బాబు తొలి తమిళ చిత్రంకి రంగం సిద్దం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : మహేష్ బాబు చిత్రాలు తమిళనాడులో డబ్బింగ్ అవుతున్నాయి. కానీ తమిళంలో స్టైయిట్ చిత్రం చేయటం కుదరటం లేదు. చాలా కాలం నుంచి తమిళంలో స్టైయిట్ గా చిత్రం చేద్దామనుకుంటున్నారు. ఆ మధ్యన మణిరత్నం దర్శకత్వంలో ఆ కోరిక తీరుతుందనుకున్నారు. అయితే వేరు వేరు కారణాలతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమిళ,తెలుగు భాషలు అనుకున్నారు. అదీ కుదరలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం,లింగు స్వామి దర్శకత్వంలో చిత్రాలు సైతం తమిళం,తెలుగు చేద్దామనుకున్నారు కానీ...అవేమీ మెటీరియలైజ్ కాలేదు. అయితే ఇన్నాళ్లకు మహేష్ తమిళ,తెలుగు భాషల్లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  మహేష్ బాబు,క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ సినిమా రూపొందబోతోంది. మహేష్‌ హీరోగా నటించే తొలి తమిళ చిత్రం ఇదే అవుతుంది. గతంలో వానమ్ చిత్రంతో తమిళంలో క్రిష్ ..వేదం రీమేక్ ని చేసిన అనుభవం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.
  దీన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ ఓకే ఇచ్చాడని,క్రిష్ తమిళంకు కావాల్సిన మార్పులు అద్దటానికి స్క్రిప్ట్ మీద ఉన్నారని తెలుస్తోంది.

  ఇక ఈ చిత్రం ద్వారా హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హా దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు చర్చలు జరిగాయి. అయితే ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని తెలుగుకు ఓకే చేసింది. ఆమె దక్షిణాదిలో చేస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్ధ వైజయంతి మూవీస్ మహేష్‌బాబు తో ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనుంది. సి.అశ్వనీదత్‌ నిర్మాత. అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ ఈ చిత్రాన్ని సమర్పించనుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఈ చిత్రంలో రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌)ఈ చిత్రంలో చర్చించనున్నారు.

  ఈ సినిమాకు 'శివమ్‌' అనే పేరుని నిర్ణయించారు. వచ్చే యేడాది ప్రధమార్ధంలో అంటే మార్చిలో సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. క్రిష్‌ సిద్ధం చేసిన కథను ఇటీవలే దర్శకుడు రాజమౌళికి వినిపించారు. ఆయన ట్విట్టర్‌లో దీని గురించి చెబుతూ ''క్రిష్‌ శివమ్‌ కథాంశాన్ని చెప్పారు. మహేష్‌ అభిమానులకి మంచి అనుభూతి కలుగుతుంది''అని రాశారు. ఈ సినిమాకి సమర్పణ: స్వప్నదత్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు. ఇతర సాంకేతిక నిపుణులు, నటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తారు.

  English summary
  
 Krish already confirmed that his next film will be with Mahesh Babu to Media. Krish has completed the major portion of script for Mahesh Babu’s film and it is said to be a full commercial entertainer and Tamil and Telugu. The movie will be produced by Ashwini Dutt under his Vyjayanthi Movies banner. If everything goes well then this movie will hit the floors in summer, 2013. Mahesh Babu’s upcoming film ’Seethamma Vakitlo Sirimalle Chettu’ will be released for Sankranthi and he is also acting another untitled film in the direction of Sukumar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more