హైదరాబాద్‌ శివార్లలో మహేష్‌ బాబు హంగామా

By Srikanya

హైదరాబాద్: 'ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో మహేష్ బాబు, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. త్వరలో యూరప్‌, బ్యాంకాక్‌లలో పాటల్ని, సన్నివేశాలనూ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో మహేష్‌ పాత్ర చిత్రణ, తదితర విషయాలను రహస్యంగా ఉంచుతున్నారు.

'దూకుడు', 'బిజినెస్‌ మేన్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలతో విజయపరంపర కొనసాగిస్తున్నారు మహేష్‌ బాబు. ఇప్పుడాయన సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. కృతి ససన్‌ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. అనిల్‌ సుంకర, గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మహేష్‌ సినిమాకి దేవిశ్రీ స్వరాలు అందించడం ఇదే తొలిసారి.

అలాగే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే.... బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు.

ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X