మహేష్, సుకుమార్ మూవీ....లేటెస్ట్ అప్‌డేట్స్

By Bojja Kumar

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం గత కొన్ని రోజులుగా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ షెడ్యూల్ పూర్తయింది. ఇంతకాలం ఇక్కడ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్, ఓ పాటను చిత్రీకరించారు.

రెండో షెడ్యూల్ మే నెలాఖరున ప్రారంభించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. త్వరలోనే తేదీ ఖరారు కానుంది. ఈ గ్యాప్‌లో మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్ ఫిల్మ్‌లో చేయడంతో పాటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో పాల్గొననున్నారు.

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దూకుడు చిత్ర నిర్మాతలైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ అండ్ డైనమిక్‌గా, వయసు చాలా తక్కువ ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇందు కోసం మహేష్ ప్రత్యేకంగా వర్కౌట్లు చేయడంతో పాటు స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడు.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్ నటిస్తోంది. ఇందులో మహేష్ కాలేజీలో లెక్చరర్ గా కనిపిస్తారు. సుకుమార్ తన దైన శైలిలో కాలేజి సీన్స్ రాసుకున్నారని వినపడుతోంది. పూర్తి ఫన్ తో కాలేజీ లెక్చరర్ కీ,స్టూడెంట్స్ కీ మధ్య నడిచే కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. సుకుమార్ గతంలో లెక్చరర్ గా చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X