twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహష్-సుకుమార్ మూవీ రిలీజ్ డిటేల్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈచిత్రానికి టైటిల్ ఖరారు కానుంది.

    ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. మే నెలలో ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కానుంది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుకరలు ఈ చిత్రాన్ని 2013 జులై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు. ఈ విషయాన్ని పిఆర్‌ఓ బిఎ రాజు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    Mahesh Babu-Sukumar movie Shooting will be complete by May. The producers trio Ram Achanta, Gopi Achanta and Anil Sunkara are planning to release the movie in July 2013. ‘Ek Tha Tiger Action Choreographer is doing a fight in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X