బర్త్ డే గిఫ్టుగా మహేష్-సుకుమార్ మూవీ రిలీజ్?

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రితి సానన్ హీరోయిన్. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు కావడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

అప్పటి వరకు అన్ని పనులు పూర్తవుతాయనే అంచనాతో ఈ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్ పరిణామాలను బట్టి రిలీజ్ డేట్ మారే అవకాశం కూడా లేక పోలేదనే వాదన వినిపిసప్తోంది. ఏది ఏమైనా ఈ చిత్ర నిర్మాతల నుంచి అఫీషియల్ ప్రకటన వెలువడితే విడుదల తేదీపై ఓ నిర్ధారణకు రావడం కష్టమే.

మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈచిత్ర యూనిట్ 40 రోజుల షూటింగ్ నిమిత్తం లండన్ బయల్దేరి వెళ్లనుంది.

ఇతర వివరాల్లోకి వెళితే, ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా మహేష్ బాబు బ్యాక్ పెయిన్‌కు గురయ్యారని, వైద్యుల సలహా మేరకు ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X