మహేష్ ‘తుంటరి’వార్తపై నిర్మాత ఫైర్...!
మహేష్ బాబు-సుకుమార్ సినిమాకు సంబంధించి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ సుంకర వెల్లడించారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని....అధికారిక సమాచారం వెలువ డే వరకు పుకార్లను నమ్మ వద్దని అనిల్ సుంకర మహేష్ బాబు అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇక సినిమా విశేషాల్లోకి వెళితే...
మహేష్ బాబు సరసన క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈచిత్రం గోవా షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మహేష్ బాబు గత చిత్రకంటే భిన్నమైన లుక్ తో ఈచిత్రంలో చూపించనున్నాడు సుకుమార్.
ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications












