23 నుంచి బ్యాంకాక్ లోనే మహేష్‌బాబు
ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో మహేష్, కాజల్ అగర్వాల్‌పై ఓ పాటను షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక ఈ నెల 23 నుంచి బ్యాంకాక్‌లో రెండో షెడ్యూల్ మొదలుకానుంది. అది లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈ భారీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ చిత్రంలో మహేష్ లెక్చరర్‌గా నటించనున్నారని గతంలో ఓ వార్త వినవచ్చింది. కానీ ప్రస్తుతం ఆ వార్తలో నిజం లేదని,అది కేవలం రూమర్ మాత్రమే అని తేలింది. ఇందులోని మహేష్ పాత్ర వివరాలను సీక్రెట్ ఉంచాలని చిత్రం యూనిట్ నిర్ణయించిందని సమాచారం. అభిమానుల అంచనాలను మించేలా, ఊహకందని స్థాయిలో ఆయన కేరక్టరైజేషన్ ఉంటుందని, మహేష్ సినిమాల్లో ఉండే యాక్షన్, సుకుమార్ స్టైల్లోని అందమైన రొమాన్స్ ఇందులో ఉంటాయని వినికిడి.
తన చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ కి డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసే సుకుమార్ ..ఈ సారి..సరికొత్తగా ప్రెజంట్ చేస్తాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే మ్యాటర్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మహేష్‌తో 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్‌ని నిర్మించిన అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట త్రయం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా రత్నవేలు, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.


Click it and Unblock the Notifications











