ఆ కథ వినగానే ఉత్కంఠకు లోనయ్యే..కమిటయ్యా: మహేష్ బాబు
మహేష్ బాబు,సురేంద్రరెడ్డి కాంబినేషన్లో మరో చిత్రం వస్తుందంటూ వచ్చిన వార్తలు నిజమవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా దర్శకుడు సురేంద్రరెడ్డి,నిర్మాత వెంకట్ ధృవపరిచారు. రవితేజ, సురేంద్రరెడ్డి కాంబినేషన్లో కిక్ చిత్రాన్ని రూపొందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ విషయాన్ని మీడియాకు అధికారికంగా తెలియచేసారు. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. "కథ వినగానే ఉత్కంఠకు లోనయ్యాను. నా కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుంద"ని అన్నారు. ఇక ఈ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ ని ప్రకటించారు. దర్శకుడు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ...ఆర్.ఆర్.మూవీ మేకర్స్ లో నేను చేసిన కిక్ మంచి విజయాన్ని సాధించింది. అలాగే మహేష్ కు కూడా ఘన విజయాన్ని ఇవ్వాలన్న ఉత్సాహంతో ఉన్నాను. అదే కసితో,పట్టుదలతో కథను సిద్దం చేసుకున్నాను. అందరి అంచనాలను మించిన చిత్రమవుతుంది అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత వెంకట్ ఈ ప్రాజెక్టు వివరాలు చెపుతూ..నిర్మాత వెంకట్ చెబుతూ "రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో 'మిస్టర్ పర్‌ఫెక్ట్'ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జూన్‌లో సెట్ మీదకు తీసుకెళ్తాం. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాను అన్నారు. ఇక గతంలో మహేష్ బాబు, సురేందర్ రెడ్డి కలయికలో 'అతిథి' చిత్రం రూపొందింది. అయితే అది భాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సురేంద్రరెడ్డి రామ్ హీరోగా టామ్ అండ్ జెర్రీ టైటిల్ తో స్రవంతి బ్యానర్ పై ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులోనూ ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











