అనుష్క మీద అతి ప్రేమ చూపిస్తున్న మహేష్
అనుష్క ఇప్పుడు అందరి హీరోలకు హాట్ ఫేవరెట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఏ హీరోయిన్ నీ పొగడని మహేష్ సైతం ఆమెపై అతి ప్రేమను చూపిస్తూ రీసెంట్ గా మాట్లాడటం అందరనీ ఆశ్చర్యంలో పడేసింది.ఈ మాట అంటున్నదెవరో కాదు...ప్రిన్స్ మహేష్ బాబు. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఖలేజా"ఫ్లాప్ అయి ఉండవచ్చు కాని ఆ సినిమాలో అనుష్క మాత్రం తనకు సరిగ్గా సూటయ్యిందని అంటున్నారు మహేష్‌బాబు. అంతటితో ఆగక,అనుష్క ప్రొఫెషనల్ నటి. తనతో పనిచేసిన హీరోయిన్లందరికన్నా ఎక్కువ మార్కులు అనుష్కకే అంటూ కితాబిచ్చాడు .అలాగే ఆ సినిమాలో అనుష్కది ఐరన్‌లెగ్ పాత్రే అయినా, ఆ సినిమాకి ఆమె గ్లామర్ ప్రధాన ఆకర్షణ అనీ, ఆమెతో పని చేయడం మరచిపోలేనని మహేష్ చెప్పుకొచ్చారు.మణిరత్నంతో తాను చెయ్యబోయే చిత్రంలో ఆమె పనిచేయటం తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ హటాత్తుగా మహేష్ కి ఆమె పై అతి ప్రేమ ఒలకపోయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు.


Click it and Unblock the Notifications











