పూరీ, మహేష్ బాబు కాంబినేషన్ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే...

By Srikanya

పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ది బిజెనెస్ మ్యాన్ అనే చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 20 వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. పోకిరి తర్వాత మహేష్, పూరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. ఇక ఈ చిత్రంలో మహేష్ ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడని సమాచారం. గ్యాగస్టర్ గా పనిచేయటం కూడా ఓ బిజెనెస్ గా భావించి చేసే ఓ వ్యక్తి కథను ఈ చిత్రం చూపుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ట్యాగ్ లైన్ ..గన్స్ డోన్ట్ నీడ్ ఎగ్రిమెంట్స్. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత వెంకట్ తెలియజేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకు ముందు పోషించనటువంటి పవర్ పుల్ పాత్రను ఈ చిత్రంలో చేస్తారు. పూరి చెప్పిన లైన్ కు మహేష్ బాగా ఇంప్రెస్ అయ్యారు. 'గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్" అనేది ఈ చిత్రం ఉపశీర్షికతో దీనిని బట్టి ఇది ఎంతటి సంచలనాత్మకంగా వుంటుందో ఊహించుకోవచ్చు. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పోకిరిని మించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. సెన్సేషన్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రం తప్పకుండా తెలుగు సృష్టిస్తుందనే నమ్మకం వుంది" అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X