స్పెయిన్ లో మహేష్ బాబు బిజినెస్...
మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ది బిజినెస్ మ్యాన్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం గోవాలో షెడ్యూల్ పూర్తి కాగానే నవంబర్ లో సినిమా యూనిట్ స్పెయిన్ కు ప్రయాణం కానుంది. ఇక్కడి అందమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ చేయనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మహేష్ బాబు సరసన తొలిసారి జతకడుతుండగా...ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యూనిట్ సభ్యల నుంచి అందిన సమాచారం ప్రకారం మాఫియా మధ్య వెపన్స్ వ్యాపారం నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని, బిజినెస్ మ్యాన్ సినిమాకు 'గన్స్ డోన్డ్ నీడ్ అగ్రిమెంట్" అనే క్యాప్షప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో షూటింగ్ పూర్తయ్యాక జనవరి 12న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, కో డైరెక్టర్: విజయ ప్రసాద్.


Click it and Unblock the Notifications











