2012 సంక్రాంతి రేసులో ఆ ముగ్గురి మధ్యే పోటీ
సంక్రాంతి సినిమావాళ్ళకు పెద్ద పండగగా మారిన సంగతి తెలిసందే. వచ్చే సంక్రాంతి విడుదలల కోసం ఇప్పుటినుంచే షెడ్యూల్స్ ప్లాన్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి పోటీలో ఈ సారి ముగ్గరు మధ్యే పోటీ ఉండబోతోందంటున్నారు. ఆ ముగ్గరూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్. ఆ సినిమాలు ఏమిటంటే..పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్, బోయపాటి చిత్రం,మహేష్ ది బిజినెస్ మ్యాన్. ఇప్పటివరకూ మహేష్ ఈ లిస్ట్ లోకి రాలేదు. కానీ తాజాగా నిర్మాత వెంకట్ పూరి ని పిలిచి డేట్స్ ఫిక్స్ చేయించి సంక్రాంతి రోజు విడుదల చేయటానికి కన్ఫర్మ్ చేయించుకున్నట్లు సమాచారం. విడుదల విషయంలోనూ, డేట్స్ విషయంలోనూ చాలా స్ట్రిక్ట్ గా ఉండే వెంకట్ నిర్ణయం తిరుగులేదంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కి ఇప్పటికే స్క్ర్రిప్టు రెడీ అయ్యి షూటింగ్ కి రెడీగా ఉంది. అలాగే బోయపాటి, ఎన్టీఆర్ సినిమా ఆల్రెడీ మొదలైంది.


Click it and Unblock the Notifications











