నాకు అండగా మహేష్ ఉన్నాడు, బాక్సాఫీసు బద్దలే: పూరీ

By Bojja Kumar

బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్‌బాబు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తున్నాం. మహేష్‌బాబు సూపర్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. 'పోకిరి" తర్వాత మహేష్‌తో చేస్తోన్న ఈ చిత్రం కొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పకొచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇలా చెప్పడం ద్వారా పోకిరి మాదిరి ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలు చేయడం ఖాయం అని చెప్పకనే చెప్పారు పూరి. 'ఇలా రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు...ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కు కొట్టేస్తాను" ఇది మహేష్‌బాబు 'బిజినెస్‌మేన్"లో మచ్చుకు ఓ డైలాగ్...ఇలాంటి డైలాగులు సినిమాలో బోలెడున్నాయి. అభిమానుల అభిరుచికి తగిన విధంగా సినిమా ఉంటుంది, ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.

సహ నిర్మాత వి.సురేష్‌డ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ముంబాయ్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 8 లోగా చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఆడియోను విడుదల చేస్తాం. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తాం" అన్నారు.

కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, భరత్‌డ్డి, రాజా తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, ఫైట్స్: విజయ్, నిర్మాత: వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X