మహేష్-పూరి కాంబినేషన్ మళ్ళీ చరిత్ర సృష్టిస్తుందా..!?
ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బేనర్ లో వెంకట్ నిర్మిస్తున్న'ది బిజినెస్ మేన్" జూలైలో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మహేష్ దూకుడు షూటింగ్ లో, పూరిజగన్నాథ్ బుడ్డా షూటింగ్ లో బిజీగా వున్నారు. అవి పూర్తిచేసుకొని జూలై నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారు. పోకిరి తర్వాత సరైన హిట్స్ లేని ఈ జంట అలాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న కసితో వున్నారు. ఈ కాంబినేషన్ లో డెఫినెట్ గా మళ్ళీ హిట్ వస్తుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
ఎందుకంటే పోకిరి ముందు పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా, సూపర్, 143 వంటి వరుస ఫ్లాపులతో వున్నాడు. అలాగే మహేష్ కూడా ఒక్కడు తర్వాత నిజం, నాని వంటి డిజాస్టర్స్ లో వున్నాడు. అయితే అర్జున్ పర్వాలేదు అనిపించింది, అతడు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నిర్మాత నష్టపోవాల్సి వచ్చింది. అలాంటి టైమ్ లో పూరి జగన్నాథ్, మహేష్ కాంబినేషన్ లో పోకిరి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఇద్దరూ వున్నారు. పోకిరి తర్వాత అతిథి, ఖలేజా వంటి ఫ్లాపులతో మహేష్ వుంటే, పోకిరి తర్వాత పూరి చేసిన సినిమాలు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చాయి. కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ వస్తున్న సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











