చురుకుగా సాగుతున్న మహేష్ బిజినెస్ మ్యాన్..!
పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు తో పూరీ జగన్నాథ్ చిత్రం 'ది బిజినెస్ మాన్" చురుగ్గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఏకకాలంలో సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి జనవరి 12 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు యుద్దప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్ చిత్రీకరణ ఈ నెల 4 ,6 తేదీల్లో జరిగింది. ఇందుకోసం ముంబై లో ఓ భారీ సెట్ ఏర్పాటుచేసారు.
ఈ సాంగ్ కు భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చగా, రాహుల్ నంబియార్, రంజిత్ గొంతు కలిపారు. రాహుల్ నంబియార్ 'దూకుడు" సినిమాలో పాడిన 'గురువారం" పాటకు అనేక ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. 'ది బిజినెస్ మాన్" చిత్రానికి సంగీతం తమన్ సమకూరుస్తున్నారు. తమన్, భాస్కర భట్ల ప్రస్తుతం ముంబై లో పాటలు కంపోజ్, రికార్డింగ్ పనిలో ఉన్నారు.
ప్రస్తుతం చిత్ర టాకీ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. మరో పాటను ఈ నెలలో షూట్ చేస్తారు. కాజల్ ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'పోకిరి"తో సత్తా చాటిన పూరి జగన్నాథ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ తాజా ప్రాజెక్టు పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











