సంవత్సరం పైగా గ్యాప్ తీసుకుని అభిమానులను నిరాశపరిచిన మహేష్ ఇప్పుడు వారిని ఆనందంలో ముంచెత్తనున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించటానికి కమిట్ అయ్యారు. అలాగే మహేష్ సోదరి ఈ భారీ ప్రాజెక్టును తమ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తోంది. త్రివిక్రమ్ రూపొందిస్తున్న వరుడు షెడ్యూల్ గ్యాప్ లో ఈ చిత్రం డేట్స్ ఎడ్జెస్ట్ చేయటానికి మహేష్ ఒప్పుకున్నాడు. రెండు సినిమాలు మూడు నెలల తేడాలో రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక జరగనుంది. గౌతమ్ మీనన్ గతంలో తెలగులో వెంకటేష్ తో ఘర్షణ చిత్రాన్ని రూపొందించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఆ మధ్య రిలీజై భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.