తండ్రి బాటలో మహేష్‌బాబు
తెలుగు సినిమా పరిశ్రమకు ఒక అదృష్ట చిహ్నంగా మారిన మహేష్‌బాబు పోకిరి సినిమాతో తన ఇమేజిని మాస్ ప్రేక్షకుల వరకూ తీసుకెళ్ళనున్నాడు. ఇప్పటివరకు ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉన్నా బి,సి సెంటర్లలో పెద్ద ఆదరణ లేని కారణంగా భారీ కలెక్షన్లు రావడం లేదు. ఆ లోపాన్ని గ్రహించిన మహేష్ పోకిరిలో తండ్రి కృష్ణ తరహాలో పక్కా మాస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా బి,సి సెంటర్లలో దుమ్మురేపుతుందని మహేష్ నమ్మకంతో ఉన్నాడు. పోకిరి సినిమాకు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాధ్, మహేష్ సోదరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇలియానా అందాలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. ఈ హాట్ సినిమా ఈ వేసవిలోనే విడుదల కానుంది.


Click it and Unblock the Notifications