మహేష్ బాబు,త్రివిక్రమ్ పిల్మ్ లేటెస్ట్...
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది.మరో భారీ షెడ్యూల్‌ను నవంబర్5 నుంచి రాజస్థాన్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు తదితరులపై 25 రోజుల పాటు కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్‌ను రాజస్థాన్‌లో చేశారు.ఈ విషయాలను నిర్మాత శింగనమల రమేష్ మీడియాకు తెలిపారు.
మా చిత్రంలో హీరో పాత్ర హైలైట్‌గా ఉంటుంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రిస్తున్నాం. వికారాబాద్‌లో చిత్రం కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ని నిర్మించాం అయినా మహేష్ - త్రివిక్రమ్‌ల కలయికలో సినిమా అంటే ఎలాంటి అంచనాలుంటాయో ఊహించాం. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందీ సినిమా. ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కథాపరంగానే కాకుండా చిత్రీకరణ పరంగా కూడా కొత్తపుంతలు తొక్కే విధంగా త్రివిక్రమ్ శ్రద్ధ తీసుకుంటున్నారు' అని తెలిపారు.
ఇక ఈ నెల 19 నుంచి హైదరాబాద్‌లో ఏకధాటిగా షూటింగ్ జరుగుతోంది. నవంబరులో రాజస్థాన్ షెడ్యూల్ ఉంటుంది.డిసెంబర్ తొలివారం నుంచి వికారాబాద్‌లో వేస్తున్న భారీ విలేజ్ సెట్‌లో షెడ్యూల్ చేస్తారు. మహేష్ సరసన అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సునీల్ పటేల్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.బుల్లిసుబ్బారావు, సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి.


Click it and Unblock the Notifications











