లాస్ అంటూ రూమర్... మహేష్ బాబు అప్ సెట్!

అయితే ఈ వార్తలపై మహేష్ బాబు అప్ సెట్‌గా ఉన్నారట. సినిమా సక్సెస్ అయిన ఐదు నెలల తర్వాత ఇలాంటి బేస్ లెస్ రూమర్స్ రావడం ఏమిటి? అంటూ తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు అభిమానులు కూడా ఈ వార్తలపై మండి పడుతున్నారు.
'బిజినెస్ మేన్' చిత్రం థియేటర్లలో రూ. 40 కోట్ల బిజినెస్ చేసింది. ఆడియో, వీడియో, శాటిలైట్ రైట్స్ కలిసి 50 కోట్ల వరకు వసూలు చేసింది. ఇలాంటి సినిమాను నష్టాలు తెచ్చిన సినిమా అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఓ వర్గం కావాలని చేస్తున్న ప్రచారం అంటూ కొట్టి పారేస్తున్నారు.
అయితే బయట వినిపిస్తున్న టాక్ ఏమిటంటే....తొలి వారం ఊపు చూసి సినిమాకు లాభాలు వస్తున్నాయని మహేష్ బాబు, దర్శకుడు పూరి తమ రెమ్యూనరేషన్‌తో పాటు షేర్ కూడా తీసుకున్నారని, ఈ సినిమాతో సంబంధం ఉన్న మహేష్ బాబు అక్క మంజుల కూడా తన వాటాను తీసుకున్నారు. ఇవన్నీ వెరసి నిర్మాతలకు లాభాలు లేకుండా చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వార్తలన్నీ ఆదారం లేని రూమర్లే అని స్పష్టం అవుతోంది. మరి నిజం ఏమిటో నిర్మాతలే తేల్చాలి.


Click it and Unblock the Notifications











