మహేష్ అభిమానులకు హ్యాపీ న్యూస్

హాలీవుడ్ స్ధాయి హావభావాలు ఇవ్వగల మహేష్ వంటి స్టార్ తో సినిమా చేయటంతో ట్రేడ్ లో మంచి మార్కెట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే యు.టివీ బడ్జెట్ కి వెనకాడే సంస్ధ కాకపోవటం,గౌతమ్ ప్రతిభ...కలసి సాంకేతికంగా తెలుగుకి ఉన్నత స్ధాయి చిత్రం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో గౌతమ్ ...పవన్ తో సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఆయన గజనీ ఫేమ్ సూర్యా తో Vaaranam Aayiram సినిమా చేస్తున్నారు.
అది పూర్తవగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్క్రిప్టు తమిళ రచయితలు వెర్షన్స్ పూర్తి చేసారని,దాన్ని తెలుగు వెర్షన్ కోసం పరుచూరి వారికి అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక మహేష్ ..త్రివిక్రమ్ కాంబినేషన్ షూటింగ్ ఈ చిత్ర షూటింగ్ ఒకే సారి సిమిలర్ గా జరిగే అవకాశం ఉంది. జనవరిలో పూజ జరిపి సినిమా రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications











