మహేష్, కొరటాల శివ చిత్రం అఫీషియల్ న్యూస్

అతిధి తరువాత ఈ సంస్థ మహేష్ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా గతఏడాది ఖరారయినా కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. యూటీవీ మోషన్ పిక్చర్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'మిర్చి'తో ఆకట్టుకొన్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
మహేష్‌బాబు మాట్లాడుతూ ''యూటీవీ సంస్థతో ఓ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇందిర ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో యు.టి.వి. తెలుగులో నిర్మిస్తున్న తొలిచిత్రంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా వుంది. యు.టి.వి. సంస్థ తెలుగులో గొప్ప విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
యు.టి.వి. దక్షిణాది బిజినెస్-స్టూడియోస్ అధ్యక్షుడు ధనంజయన్ మాట్లాడుతూ 'భారతదేశంలో హిందీ తర్వాత రెండో పెద్ద చిత్ర పరిశ్రమ అయినా తెలుగులో మా ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం ఆనందంగా వుంది. అత్యున్నత ప్రమాణాలతో తెలుగుప్రేక్షకులు గర్వించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాం. తెలుగులో మా సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రమిది. మహేష్‌బాబులాంటి హీరో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అన్ని వర్గాలను అలరించే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది''అన్నారు .
''నా మూడో చిత్రం మహేష్‌తో చేయడం సంతోషంగా ఉంది''అని దర్శకుడు చెప్పారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











