»   » మహేష్-వంశీపైడిపల్లి మూవీ: ఇలియానా గురించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

మహేష్-వంశీపైడిపల్లి మూవీ: ఇలియానా గురించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కథానాయకుడుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు నిర్మాతలుగా ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాను తీసుకోనున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.

ఇలియానాను సంప్రదించలేదు

ఇలియానాను సంప్రదించలేదు

మహేష్ బాబుతో తాము చేస్తున్న సినిమాలో ఇలియానా హీరోయిన్ అనే వార్తల్లో నిజం లేదని, అసలు ఇలియానాను తాము సంప్రదించలేదని చిత్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. త్వరలో అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపారు.

రెండు పెద్ద బేనర్లు, అంచనాలు భారీగా

రెండు పెద్ద బేనర్లు, అంచనాలు భారీగా

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని రెండు పెద్ద బేనర్లు, ఇద్దరు పెద్ద నిర్మాతలు కలిసి తీస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాబు వారసులతో ముహూర్తం

మహేష్ బాబు వారసులతో ముహూర్తం

షూటింగ్‌ ముహూర్తం ఆగస్ట్‌ 14న అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా ప్రారంభం అయింది. మహేష్‌ తనయుడు ఘట్టమనేని గౌతమ్‌ క్లాప్‌ నివ్వగా, కుమార్తె ఘట్టమనేని సితార కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. మహేష్ బాబు సినిమాలకు ఆయన పిల్లలు ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి.

త్వరలో పూర్తి వివరాలు

త్వరలో పూర్తి వివరాలు

ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, నిర్మాతలు: సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

English summary
This led to several rumors in media circles since few days which said Mahesh Babu and Ileana are working together in Vamsi Paidipally directorial. But, now this turns out to be a fake news. Producer Dil Raju says Ileana was never considered and that they had never even tried to approach her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu