బ్యాంకాక్ కి వెళ్ళందే ఈ మద్య ఏ షూటింగ్ పూర్తి కావటం లేదు. తాజాగా మహేష్ సైతం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి బ్యాంకాక్ కి షూటింగ్ కి వెళ్ళనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రెడీ కానున్న చిత్రం కోసం అక్కడ షూట్ ప్లాన్ చేసారు. సినిమా అలాగే ఈ చిత్రంలో మొదటి నుంచి సెకెండ్ హీరోయిన్ కోసం వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఆ పాత్ర నిడివి చాలా తక్కువని, అందుకే పేరున్న హీరోయిన్స్ అంతా రిజెక్టు చేసారని సమాచారం. తాము డాన్స్ నంబర్ కోసమో, కొన్ని రొమాన్స్ సీన్స్ కోసమో పరిమితం కాలేమని తేల్చి చెప్పారంటున్నారు. త్రివిక్రమ్ రచన చేసిన జల్సా సినిమా సమయంలోనూ పవన్ ప్రక్కన కదా అని కమిలిని ముఖర్జీ చేసిందని, అయితే ఆ పాత్ర బాగా తక్కువ అవటం ఆంటీ లుక్ తేవటం జరిగిందని, తాము వాటికి సిద్దంగా లేమని అయితే ఆ విషయం పైకి చెప్పక డేట్స్ ఖాళీలేవని చెప్తున్నారంటున్నారు.