మహేష్-వెంకీ ‘ఎస్‌విఎస్‌సి’ లేటెస్ట్ ఇన్ఫో..
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఒక చిన్న విరామం తర్వాత మళ్లీ సెట్స్‌పై వచ్చింది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 2 కోట్లతో వేసిన సెట్‌లో జరుగుతోంది.
మహేష్ బాబు, సమంతలపై పెళ్లి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాను ముందుకు తీసుకెలుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో ఇక్కడ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేను పురస్కరించుకుని మే 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో పోకిరి, దూకుడు చిత్రాల ఫస్ట్ లుక్ కూడా కృష్ణ బర్తడే సందర్భంగా విడుదల చేశారు. ఆ సెంటిమెంటు కలిసొచ్చి సినిమా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన అంజలి, మహేష్ సరసన సమంత నటిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సాగుతుంది. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలించేలా తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోయేలా ఉంటాయట. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్ రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











