శుభముహోర్తంలో ప్రారంభమైన మహేష్-వెంకటేష్ ల సినిమా..!
సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మల్టి స్టారర్ మూవీ సాక్షాత్కరిస్తుంది. వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించే మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ రోజు (గురువారం) తెల్లవారుఝామున హైదరాబాదులో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. హైదరాబాదులోని దిల్ రాజు ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ పెద్దలు దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, రాజమౌళి, వివి వినాయక్, శ్యాం ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వివివినాయక్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. రాఘవేంద్రరావు తొలిషాట్ కి దర్శకత్వం వహించారు. రాజమౌళి సినిమా స్క్రిప్టును దర్శకుడికి అందజేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, 'ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. మంచి కథ వుంటే మల్టీ స్టారేర్ చేస్తానని వెంకీ గతంలో నాకు చెప్పారు. దాంతో ఈ కథ వినిపించాం. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత మహేష్ బాబుని కలిసినప్పుడు నేను చేయబోయే ప్రాజక్ట్స్ గురించి అడిగారు. ఈ సినిమా టైటిల్ చెప్పగానే, ఆయన ఎంతో ఇష్టపడ్డారు. వెంటనే డైరెక్టర్ని పంపి కథ చెప్పించాను. వినగానే చేయడానికి వెంటనే యాక్సప్ట్ చేశారు. అలా ఈ ప్రాజక్టు పట్టాలకు ఎక్కింది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మే నెలకల్లా పూర్తవుతుంది. వచ్చే వేసవికి విడుదల చేయడానికి ప్లాన్ జరుగుతోంది" అన్నారు. అయితే, వెంకీ, మహేష్ లు నగరంలో లేకపోవడంతో ఈ కార్యక్రమంలో పాల్గోలేకపోయారు అన్నారు.


Click it and Unblock the Notifications











