మహేష్-వెంకటేష్ ల మల్టీస్టార్ మూవీ తొలి షెడ్యూల్ వివరాలు...!?
వెంకటేష్, మహేష్ ల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ డిసెంబర్ 5నుంచి ప్రారంభం కాబోతుంది. 30 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో మహేష్ పాల్గొనడు. కానీ వెంకటేష్ పై ఈ షెడ్యూల్ లో కీలకమైన టాకీపార్ట్ ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
బిజినెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ అది కంప్లీట్ అయ్యాక ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా సమంతని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ సరసన మహేష్ కు వదిన పాత్రలో అనుష్క దాదాపుగా ఖరారైపోయింది. జనవరి నుంచి జరిగే షెడ్యూల్ లో మహేష్ పాల్గొంటాడని తెలుస్తోంది. అత్యంత క్రేజీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని సమ్మర్ రాజుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.
ఈ మద్య కాలంలో, చిన్నా చితకా హీరోలతో వచ్చిన సినిమాలకి మల్టీస్టారర్ మూవీస్ అని ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు పేర్లు పెట్టుకున్నప్పటికీ వెంకటేష్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మాత్రం నిజంగానే మల్టీస్టారర్ మూవీగా వార్తల్లోకి ఎక్కింది. ఒకప్పుడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ కి కొదవలేదు. చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ అవుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











