వాళ్లు మగాళ్లను కూడా వదలడం లేదు.. కమెడియన్ మహేష్ విట్టా షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్ భూతం సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా చెలరేగుతుందో అందరికి తెలిసిందే. సినీ రంగంలోనే కాకుండా లైంగిక వేధింపులు అనేవి వివిధ రంగాల్లో కూడా ఉన్నవే. ముఖ్యంగా సెక్సువల్ ఫేవర్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువగా ఫోకస్ అయ్యేది కాబట్టి అందరు ఇక్కడే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గత కొన్నాళ్లుగా చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే కొన్నిసార్లు మగాళ్లకు కూడా ఆ ఇబ్బందులు తప్పడం లేదట. ఫన్ బకెట్ మహేష్ విట్టా కూడా ఇటీవల ఆ విషయంపై స్పందించాడు.

అవకాశాలు రావాలంటే..

అవకాశాలు రావాలంటే..

మూవీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు రావాలంటే పడక పంచుకోవాల్సిందే అన్నవారు కూడా ఉన్నారు. కొత్తగా వచ్చినవారికి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేవరకు కొన్ని ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అడవాళ్లకే కాకుండా మగాళ్లను కూడా లైంగికంగా వేదించే వాళ్ళు ఉన్నారని కొంతమంది వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతున్నారు.

బిగ్ బాస్ ఫేమ్ మహేష్..

బిగ్ బాస్ ఫేమ్ మహేష్..

బిగ్ బాస్ సీజన్ 3లో మహేష్ విట్టా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. మహేష్ మొదట్లో ఫన్ బకెట్ జోక్స్ ద్వారా జనాల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాల్లో చిన్న తరహా కామెడీ రోల్స్ తో మెప్పించాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో మగాళ్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా..

ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా..

మహేష్ విట్టా మాట్లాడుతూ.. 'నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను. అవకాశాలు అంత ఈజీగా రావు. అయితే అడవాళ్లకే కాకుండా సినిమా ఇండస్ట్రీలో మగాళ్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ భారిన పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నేను నిజంగా చాలా ఆశ్చర్య పోయాను. ఇలాగే నా స్నేహితుడు ఒకసారి ఒక ప్రొడక్షన్ హౌజ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు'

Recommended Video

Payal Rajput About #Metoo Movement And Casting Couch || Filmibeat Telugu
షాక్ అయ్యాడు..

షాక్ అయ్యాడు..

నా స్నేహితుడు ఒకడు ఒకసారి ఒక చిన్న నిర్మాణ సంస్థ కొత్త సినిమా స్టార్ట్ చేస్తుందని ఒక అవకాశం కోసం వెళ్ళాడు. వాడు చాలా స్మార్ట్ గా ఉంటాడు. ఏదైనా ఒక క్యారెక్టర్ తప్పకుండా ఇస్తామని చెప్పారు. అయితే ఆఫీస్ లో ఒక నిర్మాత నా ఫ్రెండ్ ని సెక్సువల్ ఫేవర్ అడుగాడు. నిజంగా అది చాలా దారుణమైన విషయం. వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాడు. అలాగే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌజ్ లో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నట్లు నా స్నేహితుడు చెప్పాడని మహేష్ విట్టా వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X