కేక్ మిక్సింగ్ ఈవెంట్-మహేష్ భార్య నమ్రత, కొడుకు గౌతం సందడి
హైదరాబాద్: క్రిస్‌మస్ మేడుక దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు చోట్ల కేక్ మిక్సింగ్ ఈవెంట్లు ఊపందుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో జరిగిన కేక్ మిక్సింగ్ వేడుకకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, తనయుడు గౌతం హాజరై సందడిగా ఈ వేడుకలో పాల్గొన్నారు. కేక్ తయారీలో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్, ఇతర పదార్థాలను బ్రాండి, విస్కీ, రమ్ లాంటి లిక్కర్ ద్రావణాలతో మిక్స్ చేస్తూ ఈ కార్యక్రమం సాగింది.
మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ కార్యక్రమంలో తన తోటి పిల్లలతో కలిసి సంతోషంగా గడిపారు. స్వయంగా కేక్‌పై క్రీమ్ డిజైన్స్ వేయడం ఎలాగో నేర్చుకున్నాడు. గౌతం సంతోషంగా గడుపుతుంటే చూసి సంబర పడిపోయింది నమ్రత. మహేష్ బాబు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వలన ఈ వేడుకకు హాజరు కాలేక పోయారని తెలుస్తోంది.
స్లైడ్ షోలో....కేక్ మిక్సింగ్ కార్యక్రమానికి సంబంధించిన పోటోలతో పాటు, గౌతం తెరంగ్రేటం చేయబోతున్న తొలి సినిమా వివరాలు పరిశీలిద్దాం...

గౌతం కృష్ణ
మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘1' చిత్రం ద్వారా ఆయన తనయుడు గౌతం కృష్ణ తెరంగ్రేటం చేయబోతున్నారు.

నమ్రత
మిస్ ఇండియా, మాజీ సినీ నటి అయిన నమ్రత ప్రస్తుతం ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం చూసుకుంటూ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా గౌతంను నటుడిగా తీర్చి దిద్దేందుకు ఆమె ప్లానింగ్‌గా ముందుకు సాగుతున్నారు.

గౌతం ఆనందం
మహేష్ తనయుడు గౌతం కృష్ణ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో ఎంత సంతోషంగా పాలు పంచుకున్నాడో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతుంది.

మహేష్ బాబు వారసుడు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడంటే ఎన్ని అంచనాలు ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు నటిస్తున్న ‘1' చిత్రం ద్వారా గౌతం ఎంట్రీ ఇస్తుండటంతో అందరినీలోనూ ఆసక్తి నెలకొంది.

కేక్ మిక్స్ చేస్తూ...
హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో కేక్ మిక్స్ చేస్తూ సందడిగా గడుపుతున్న గౌతం

నమ్రత, గౌతం
కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను తనయుడు గౌతంకు వివరిస్తున్న నమ్రత.

మహేష్ బాబు 1
మహేష్ తాజా చిత్రం '1' (నేనొక్కడినే) . సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం గోవా తీరంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే.

బుల్లి మహేష్ బాబు పాత్రలో
మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











