ఈ రోజే ఫినిష్ చేయనున్న మహేష్ బాబు

ఈ నెల 11న గ్రాండ్‌గా విడుదలవుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 7న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. విక్టరీ వెంకటేష్-మహేష్ బాబు కాంబినేషన్ కావడం, చాలా ఏళ్ల తర్వాత భారీ తారాగణంతో మల్టీ స్టారర్ చిత్రం తెలుగులో రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వెంకటేష్ సరసన అంజలి రొమాన్స్ చేస్తుండగా, మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. జయసుధ, ప్రకాష్ రాజ్, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఇప్పటి వరకు సౌతిండియాలో ఏ చిత్రం సాధించని ఘనత సాధించి రికార్డ్ నెలకొల్పింది. ఈ చిత్రం న్యూయార్క్ సిటీ మాన్‌హట్టన్‌లోని TIMES SQUARE AMC Empires 25 థియేటర్లో విదలవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











