ఎన్టీఆర్ బయోపిక్ కోసం కృష్ణగా మారబోతున్న మహేష్!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ఆలస్యమవుతోంది. కానీ చిత్రయూనిట్ అంతా పక్కాగా సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితం అనేక మంది ప్రముఖులతో ముడిపడి ఉంది. ఆ పాత్రలని తూతూ మంత్రంగా ముగించడానికి బాలయ్య ఇష్టపడడం లేదు. అన్ని పాత్రలు స్థాయికి తగ్గట్లుగా ఉండాలని బాలయ్య భావిస్తున్నాడు.
ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్ బాబు నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ మహేష్ ని సంప్రదించగా ఒకే చెప్పాడని కూడా సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది.

పలువురి స్టార్స్ ని ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసి ఎన్టీఆర్ బయోపిక్ స్థాయిని పెంచాలని బాలయ్య భావిస్తున్నాడు. మహేష్ కూడా ఈ చిత్రం నటించడం ఒకే అయితే ఎన్టీఆర్ బయోపిక్ మరింత ఆసక్తిగా మారుతుంది. ఏఎన్నార్ పాత్రకు నాగచైతన్యని ఒప్పించే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య ఇప్పటికే తన తాతయ్య పాత్రలో మహానటి చిత్రంలో మెరిశాడు.


Click it and Unblock the Notifications











