ఎమోషనల్ మూమెంట్.. వైరల్ అవుతున్న మహేష్ తల్లి ఫొటో!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదల అవుతుండడం విశేషం. అంతకు మించిన ఎమోషనల్ మూమెంట్ మహేష్ బాబుకి మరొకటి ఉంది. నేడు ఆయన తల్లి ఇందిరాదేవి జయంతి నేడు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మహేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడించాడు.
భరత్ అనే నేను చిత్రం తనకు చాలా ప్రత్యేకమని ఎందుకంటే ఈ చిత్రం తన తల్లి జన్మదినం రోజున విడుదల కాబోతోందని తెలిపాడు. తాజగా మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి యంగ్ గా ఉన్నప్పటి అపురూపమైన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ కామెంట్ పెట్టాడు.
మహేష్ తల్లి ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సర్వత్రా పాజిటివ్ బజ్ తో ఈ చిత్రం విడుదలవుతోంది. వీరి కాంబినషల్ లో ఇప్పటికే శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











