స్టైలిష్ ఫొటోతో తన డైరెక్టర్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన మహేష్!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం వంశీ దాదాపు రెండేళ్ల పాటు ఎదురుచూశాడు. నేడు వంశీ పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు అతడికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. వంశీ నేటితో 40 వ పడిలోకి అడుగు పెట్టాడు.
40 ఏళ్ళ నా యువ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. మున్నా చిత్రంతో మారిన వంశీ ఆ తరువాత బృందావనం, ఎవడు వంటి హిట్ చిత్రాలని తెరకెక్కించాడు. చివరగా తెరకెక్కించిన ఊపిరి చిత్రంతో వంశీపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురిశాయి.

ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రంలో మహేష్ బాబుని కొత్తగా చూపించబోతున్నాడు. రైతు కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











