తండ్రిగా గర్వపడుతున్నా.. కొడుకు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ విషెష్!
సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు పుట్టినరోజు నేడు. గౌతమ్ కు 12 సంవత్సరాలు నిండాయి. మహేష్ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటాడో.. అదేవిధంగా వారిని ప్రాణంకన్నా మిన్నగా ప్రేమిస్తాడు. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు విష్ చేశాడు.
ఒక అందమైన ఫొటో పోస్ట్ చేసి గౌతమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. గౌతమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు యువకుడిగా ఎదుగుతుంటే తండ్రిగా నాకు గర్వంగా ఉంది అంటూ మహేష్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.

సినిమా విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











