పోకిరిలో మహేష్‌బాబు కొత్త గెటప్
ఈ వేసవిలో విడుదల కానున్న అతి పెద్ద సినిమాల్లో మహేష్‌బాబు పోకిరి ఒకటి. ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా ఉన్న దర్శకుడు పూరీ జగన్నాధ్ తన ఐడియాలన్నిటినీ ఇందులో రంగరించారు. సక్సెస్ ఫార్ములాకు మూలమైన ప్రేమ, యాక్షన్ ఈ సినిమాలో ప్రధానాంశాలు. మాఫియా నాయకుడిగా ప్రకాష్‌రాజ్ సహజంగానే అద్భుతంగా నటించాడు. పోలీసు ఆఫీసరుగా సాయాజీ షిండే, మరో రెండు ముఖ్య పాత్రల్లో ఆశిష్ విద్యార్ధి, నాజర్ నటించారు. ఇందులో ప్రధాన హీరోయిన్ ఏరోబిక్ టీచర్. ఇవన్నీ చదువుతుంటే ఏదో అద్భుత సినిమా తయారైనట్టు అన్పిస్తోంది కదూ!. కెమెరా శ్యామ్ కె నాయుడు. స్టంట్ మాస్టర్ విజయన్. ఈ సినిమాలో హీరోయిన్ ఇలియానా అందాలు ప్రేక్షకులకు విందు చేయనున్నాయి. హాస్యనటులు అలీ, బ్రహ్మానందం, వేణుమాధవ్ ఈ సినిమాలో విభిన్నంగా నటించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పొడవైన జుట్టు, కొన్ని సన్నివేశాల్లో రఫ్ ఫేస్‌తో కన్పించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications