మహేష్‌తో అల్లు అర్జున్ పోటీ.. అసలు కారణం ఇదేనట.. జనవరి 12న రణరంగమే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి జతకట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హ్యట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అల వైకుంఠపురం అనే క్లాసీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సంక్రాంతి రేసులో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబును ఢీకొట్టేందుకు సిద్ధం కావడం వివాదంగా మారింది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో జనవరి 12న తేల్చుకోవడానికి అల్లు అర్జున్ సిద్దం కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక అల్లు అర్జున్ ఇంతటి సహసానికి పూనుకోవడం వెనుకు ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

హ్యాట్రిక్ విజయం కోసం

హ్యాట్రిక్ విజయం కోసం

గత చిత్రం అల్లు అర్జున్ గత చిత్రం నా పేరు సూర్య బాక్సాఫీస్ వద్ద సంతృప్తికరమైన ఫలితాన్ని అందించలేదు. అందుచేతనే కాస్తా గ్యాప్ వచ్చిన సరే.. త్రివిక్రమ్‌ను ముగ్గులోకి దించాడు. గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చిందంటూ విడుదల చేసిన టీజర్ వైరల్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న మహేష్‌తో పెట్టుకోవడం ఏమిటనే విషయం ఆసక్తిగా చర్చించుకోవడం జరిగింది.

మెగా ఫ్యాన్స్‌తో

మెగా ఫ్యాన్స్‌తో

ఇక ఇటీవల కాలంలో మెగా ఫ్యాన్స్ అండ కూడా అల్లు అర్జున్ లేదు. గత చిత్రం దువ్వాడ జగన్నాథం చిత్రం రిలీజ్ సమయంలో స్టైలిష్ స్టార్ సినిమాను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం వివాదమైంది. అంతేకాకుండా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో సంబంధాలు అంతంత మాత్రమే అనే మాట వినిపిస్తున్నది. ఈ క్రమంలో మెగా సపోర్ట్ లేకుండా మహేష్‌తో పోటీ పడటం ఏమిటి అనే వాదన బలంగా వినిపిస్తున్నది.

తప్పనిసరి పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్

తప్పనిసరి పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్

అయితే త్రివిక్రమ్, బన్నీ రిలీజ్ స్ట్రాటేజీపై పలు రకాల కథలు వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ రోజునే అల వైకుంఠపురం మూవీని రిలీజ్ చేయడం వెనుక పక్కా ప్లాన్ ఉందట. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. ఒకరి సినిమాలు రిలీజైతే మరొకరు ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటి నేపథ్యంలో మహేష్ సినిమాకు పోటీగా అల వైకుంఠపురం చిత్రాన్ని రిలీజ్ చేస్తే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందని, తప్పనిసరి పరిస్థితుల్లో తనకే మద్దతు లభిస్తుందనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం.

స్టైలిష్ స్టార్ ట్రిక్ పనిచేస్తుందా?

స్టైలిష్ స్టార్ ట్రిక్ పనిచేస్తుందా?

మెగా ఫ్యాన్స్ వర్సెస్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అనే ట్యాగ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పనిచేస్తుందా? అనే విషయం చర్చనీయాంశమౌైంది. త్రివిక్రమ్, బన్నీ ప్లే చేసే ట్రిక్ ఫలిస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆధిక్యం ప్రదర్శించినట్టే అవుతుందని పేర్కొంటున్నారు. అయితే జనవరి రెండోవారంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రగడ ఎక్కువగానే ఉంటుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ కెరీర్‌ విషయంపై

అల్లు అర్జున్ కెరీర్‌ విషయంపై

ఇక అల వైకుంఠపురం సినిమా తర్వాత అ్లలు అర్జున్ తన 20వ సినిమా కోసం దర్శకుడు సుకుమార్‌‌ను రంగంలోకి దించారు. వాస్తవానికి మహేష్‌తో సుకుమార్ సినిమా చేయాల్సి ఉండగా... కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని విషయం తెలిసిందే. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో తన 21వ సినిమాను చేయబోతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X