దటీజ్ మహేష్‌బాబు.. మొన్న రైతన్నకు.. నేడు గ్రామీణ చేనేతకు అండగా..
సూపర్ స్టార్ మహేష్ ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఈ మధ్యనే మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టి గచ్చిబౌలిలో విలాసవంతమైన 'ఏఎమ్‌బీ' సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే... ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ సరికొత్త వస్త్ర ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లనున్నారు. స్పాయిల్‌తో కలిసి ఆయన ప్రారంభించిన క్లాత్ బ్రాండ్ ది హంబుల్ కో బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ..

అలాంటి దుస్తులే ధరిస్తాను
నేను చాలా కంఫర్ట్‌గా ఉండే దుస్తులను ధరించడానికే ప్రాధాన్యత ఇస్తాను. జీన్స్ ప్యాంట్, చెక్స్ షర్ట్‌ను ఎక్కువగా ధరిస్తుంటాను. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామీణ చేనేత కార్మికులకు పనిని కల్పించేలా ఉండే దుస్తులే ధరించడానికి ఎక్కువ ఇష్టపడతాను. అవే నా ఫేవరేట్ అని మహేష్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నా వద్ద బ్లూ, చెక్స్‌తో ఎన్ని దుస్తులు ఉన్నాయో నాకే తెలియదు అని అన్నారు.

సరికొత్త ఆలోచనతో హంబుల్
హంబుల్ అంటే నిజంగా ఉండటం...వినయంగా ఉండటం. క్లాత్ బిజినెస్‌లోకి రావాలనే ఆలోచన అని కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచనైతే ఉండింది. ఆ సమయంలో భార్గవ్ నన్ను కలిశారు. ఆయన విజన్ నచ్చడమే కాదు..ఎగ్జయిటెడ్‌గా కూడా అనిపించింది. అందుకే భార్గవ్‌తో కలిసి ముందుకు నడిచాను. వారి సృజనాత్మక కూడా నాకు బాగా నచ్చిందన్నారు.

బర్త్‌డేకు రెండు రోజుల ముందు
మనసులో చాలా రకాలు బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. అయితే సినిమాల్లో నటించడానికి నేను ముందు ప్రాధాన్యతనిస్తాను. నా పుట్టినరోజుకి రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో నా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానులున్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని. మీరు బయట ఎవరి స్టైల్‌నైనా ఇష్టపడతారా? అని అడిగితే. . చూడగానే రియల్‌గా అనిపించే ఏ స్టైల్‌ను అయినా నేను ఇష్టపడతాను. నా ఫేవరేట్ కలర్ బ్ల్యూ చెక్స్ అండ్ జీన్స్ అని మహేష్ అన్నారు.

హంబుల్ స్టార్ట్ చేయడం వెనుక
జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం రోజున హంబుల్‌ను ప్రొడక్ట్‌ను ప్రారంభించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓ మంచి రోజున మా హంబుల్‌ను స్టార్ట్ చేయడం ఎగ్జయిటింగ్‌గానే అనిపిస్తుంది. భార్గవ్, సుశ్రితకు అందుకు థ్యాంక్స్. నిజానికి భార్గవ్ వచ్చిన ఆలోచన చెప్పగానే నచ్చింది. ఆయన హంబుల్ అనే పేరు చెప్పగానే కనెక్ట్ అయిపోయాను. నా పర్సనాలిటీకి దగ్గరగా ఉంటుందని ఫీలయ్యాను. హంబుల్‌లో ఎం, బి అనే అక్షరాలు పక్క పక్కనే ఉన్నాయని అనుకోలేదు. వాటిని గమనించిన మా గ్రాఫిక్స్ టీం వాటిని అండర్ లైన్ చేసింది.


Click it and Unblock the Notifications











