twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ ఫైట్‌ మాస్టర్స్‌ ఆధ్వర్యంలో మహేష్‌ బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్ : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మహేష్‌బాబు ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందునిమిత్తం నగర శివార్లలో ఓ భారీ సెట్‌ని కూడా వేశారు. సల్మాన్ ఖాన్ 'ఏక్‌ థా టైగర్‌' సినిమాకి పని చేసిన ఫైట్‌ మాస్టర్స్‌ ఆధ్వర్యంలో ఈ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.

    14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా కృతిసనన్‌ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. అనిల్‌ సుంకర్‌, గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

    ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకోసం దర్శకుడు కొత్తలుక్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. మొదటినుంచీ మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దాకా ప్రతీ చిత్రంలోనూ ఢిఫెరెంట్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పోకిరి నుంచి ఆయన పూర్తిగా ఢిఫెరెంట్ లుక్ తో కనిపిస్తూ వస్తున్నారు.

    ఈ చిత్రంలోనూ మహేష్ మొత్తం ఓవరాల్ గా కొత్తదనాన్ని ప్రెజెంట్ చేయటానికి, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇప్పటివరకూ కనిపించని ఆల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించనున్నారు. ఆ లుక్ ఫ్యాన్స్ ని పూర్తిగా అలరిస్తుందని భావిస్తున్నారు. 'రెబల్' చిత్రంలో గ్యాంగ్ స్టర్ బ్రదర్‌గా విలన్ పాత్ర పోషించిన విక్రమ్ సింగ్...మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కూడా బ్యాడ్ బాయ్ పాత్రలో మహేష్ బాబుతో ఫైట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    
 Currently Maheshbabu is busy shooting for Sukumar’s film which is yet to be titled and the hero is believed to be taking extra care in dancing and fights and has brought the fight masters from hollywood. The hero seems to done risky shots in fight sequences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X