For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏపీ సీఎంగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం: భరత్ అనే నేను 'ఫస్ట్ ఓథ్'

  By Rajababu
  |
  భరత్ అనే నేను 'ఫస్ట్ ఓథ్'

  'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'భరత్ అనే నేను'. పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదన్న లోటును తీరుస్తూ తాజాగా చిత్ర యూనిట్ 'ఫస్ట్ ఓత్'ని రిలీజ్ చేసింది. సీఎంగా మహేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ ఆడియో ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది..

  ఆరోజు ఉదయాన్నే'మహేష్ ప్రమాణ స్వీకారం'.. హెడ్ ఫోన్స్‌తో సిద్దంగా ఉండండి

  ఇదీ ఫస్ట్ ఓథ్:

  "భరత్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను"

   వీడియోపై ఆసక్తి పెంచిన ఆడియో..:

  వీడియోపై ఆసక్తి పెంచిన ఆడియో..:

  రియల్ లైఫ్ లో రాజకీయాలంటేనే 'నో కామెంట్' అన్నట్లుగా వ్యవహరించే మహేష్ బాబు.. రీల్ లైఫ్ పై ఓ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా విడుదలైన మహేష్ 'ఫస్ట్ ఓథ్'ను వీడియో రూపంలో ఎప్పుడు చూస్తామా? అన్న ఆసక్తి అభిమానుల్లో రెట్టింపయింది.

  కొరటాల ప్రకటన:

  భరత్ అనే నేను 'ఫస్ట్ ఓత్' విడుదలకు ముందు దర్శకుడు కొరటాల శివ ఒక ప్రకటన చేశారు. 'నేను మీ కొరటాల శివ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌లో మహేష్‌బాబుగారితో నేను తీయబోయే తర్వాతి ఫిల్మ్‌ పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌కు సంబంధించిందని చాలా మందికి తెలుసు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఒక ఫిక్షనల్‌ పొలిటికల్‌ డ్రామా ఈ స్టోరీ.' అని తెలిపారు.

   ప్రమోషన్ కు సరైన సమయం:

  ప్రమోషన్ కు సరైన సమయం:

  'భరత్ అనే నేను ప్రమోషన్స్‌ ప్రారంభించడానికి సరైన సందర్భంగా కోసం వేచి చూశాం. జనవరి 26న రిపబ్లిక్‌ డే రోజు మంచిదని చిత్ర బృందం అంతా భావించాం. రిపబ్లిక్‌ డే రోజు ఉదయం 7గంటలకు ఈ సినిమాకు సంబంధించిన 'ఫస్ట్‌ ఓథ్‌' పేరుతో ఒక ఆడియోను విడుదల చేస్తున్నాం.' అని కొరటాల చెప్పుకొచ్చారు.

   ఆనందిస్తారని ఆశిస్తూ..

  ఆనందిస్తారని ఆశిస్తూ..

  'ఇలాంటి సందర్భంగా ఒక వీడియోకంటే ఆడియో విడుదల చేస్తేనే మంచిదని అందరం భావించాం. అందుకని అన్ని రేడియో ఛానల్స్‌లోనూ, లీడింగ్‌ మ్యూజిక్‌ ఫ్లాట్‌ఫాం పైనా, అన్ని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాంలపై ఆడియోను విడుదల చేస్తున్నాం. దీనిని అందరూ విని, ఆనందిస్తారని ఆశిస్తున్నా' అని కొరటాల శివ తెలిపారు.

  అదే టైటిల్ కొనసాగిస్తారా?:

  అదే టైటిల్ కొనసాగిస్తారా?:

  నిజానికి ఈ సినిమాకు 'భరత్ అనే నేను' వర్కింగ్ టైటిల్ గా మాత్రమే ప్రచారంలో ఉంది. ఇదే టైటిల్ ను కొనసాగిస్తారా?.. లేక మారుస్తారా? అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే ఈ టైటిల్ జనాల్లోకి వెళ్లిపోయింది కాబట్టి దీన్నే కొనసాగించే అవకాశం లేకపోలేదు.

  English summary
  maheshbabu first oath for Bharat anu nenu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X