అమ్మాయిల గుండెల్లో గుబులు రేపుతూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ సంపాదించుకున్న నటుడు ప్రిన్స్ మహేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు తగ్గ తనయ అనిపించుకోవడమే కాకుండా పోకిరి సినిమాతో టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసిన ఘనతను సాధించాడు. తండ్రిలాగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న మహేష్ తండ్రిలాగా రాజకీయాలలోకి వెళ్లే ఆలోచనేమైనా ఉందా అని అడిగితే అలాంటిదేమీలేదన్నాడు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయలలోకి వెళ్లాల్సిన అవసరం లేదు...ప్రజలు నాకవసరమైన స్టార్ డమ్ ను, ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు...అంతమాత్రానా వారికేదో తిరిగి ఇవ్వాలని రాజకీయాలలోకి వెళ్లాల్సిన అవసరం లేదు.. నేను నా అభిమాన సంఘాల ద్వారా, ఇతర మార్గాల ద్వారా సామాజిక సేవ చేస్తాను..నేను సినిమా స్టార్ గానే కొనసాగాలనుకుంటున్నాను...ప్రజలకు ఆనందాన్ని పంచాలనుకుంటున్నాను...అన్నారు మహేష్ బాబు.
Story first published: Thursday, July 16, 2026, 23:51 [IST]