మహేష్ బాబు.. ది బిజినెస్‌మాన్..ఆరంభం అదుర్స్, మొదలుపెట్టడమే అమీర్ ఖాన్‌తో!
సూపర్ స్టార్ మహేష్, పూరిజగన్నాథ్ దర్శత్వంలో వచ్చిన బిజినెస్ మాన్ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంలో మహేష్ సామాన్యుడిగా ముంబైలోకి అడుగుపెట్టి మాఫియా డాన్ గా ఎదుగుతాడు. సూర్య భాయ్ గా మహేష్ తన బిజినెస్ ని దేశవ్యాప్తంగా విస్తరిస్తాడు. నిజజీవితంలో కూడా మహేష్ బిజినెస్ మాన్ గా మారబోతున్నాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో మహేష్ కు చెందిన భారీ మల్టిప్లెక్స్ నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మల్టిప్లెక్స్ ప్రారంభం కాబోతోంది.

మహేష్ బాబు ఏఎంబి సినిమాస్
ఏఎంబి పేరుతో ఈ మల్టీప్లెక్స్ జరిగినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఈ మల్టిప్లెక్స్ ప్రారంభవోత్సవం జరగబోతోందట. 6 స్క్రీన్స్ తో కళ్ళు చెదిరే విధంగా మల్టి ప్లెక్స్ ని నిర్మించారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అమిర్ ఖాన్ క్రేజీ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో మహేష్ బాబు మల్టి ప్లెక్స్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

150 కోట్ల వాటా
సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మరో వ్యాపార వేత్త సునీల్ నారంగ్ భాగస్వామ్యంలో దీని నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరికీ 150 కోట్లకు పైగా వాటా ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 8 న ఏఎంబి సినిమాస్ ప్రారంభోత్సవంలో మహేష్ పాల్గొననున్నాడు.

మహర్షిగా బిజీ
మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిభ గల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ నిర్మిస్తున్నారు. మహెష్ అభిమానులు కోరుకునే మాస్ అంశాలతో పాటు సందేశాత్మక అంశాలు కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో
సొంత మల్టి ప్లెక్స్ ఏఎంబి సినిమాస్ లో ప్రదర్శించబోయే మహేష్ తొలి చిత్రం మహర్షినే. ఏ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. భవిషత్తులో ఆంధ్ర తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలలో ఏఎంబి సినిమాస్ విస్తరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాపారంలో మహేష్ సతీమణి నమ్రత కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











